VIDEO: 'ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'
E.G: రాజానగరం మండలం కొండ గుంటూరు గ్రామంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకు ఉచిత వైద్య చికిత్స చేసి మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తనకాల వెంకటరమణమ్మ నాగేశ్వరావు సూచించారు.