ఊడిన రన్నింగ్ బస్సు డోరు.. విద్యార్థులకు తీవ్ర గాయాలు
కర్ణాటక సౌత్ కన్నడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోర్డు పరీక్షలు రాయడానికి అక్కాచెల్లెల్లు ఆర్టీసు బస్సు ఎక్కగా.. రద్దీ కారణంగా డోరు వద్ద నిలబడ్డారు. అయితే బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో డోర్ ఊడిపోయి విద్యార్థినులు రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఘటనపై KSRTC విచారణకు ఆదేశించింది.