ALERT: మూడు రోజుల పాటు వర్షాలు
TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పలు చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ 40-50 కి.మీ. వేగంతో, రేపు, ఎల్లుండి 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.