36 బస్సులపై కేసులు నమోదు

36 బస్సులపై కేసులు నమోదు

ELR: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 36 పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేశామని జిల్లా ఉపరవాణ కమిషనర్ షేక్ కరీం శుక్రవారం తెలిపారు. ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో పాఠశాల బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 36 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.5,14,400 బస్సులకు అపరాధ రుసుము విధించారు.