ఆర్మూర్‌లో అగ్నిమాపక వారోత్సవాలు
NZB: ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద బుధవారం అగ్నిమాపక కేంద్ర అధికారి విక్రమ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సురేష్, తిరుపతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు