కేతకి హుండీ ఆదాయం రూ. 33,66,477
SRD: మండల కేంద్రమైన ఝరాసంగం లోని కేతకి ఆలయంలో శుక్రవారం హుండీని హైదరాబాద్ శ్రీ నరసింహ సేవ సమితి వారు లెక్కించారు. ఎండోమెంట్ పర్యవేక్షకులు రంగారావు ఆధ్వర్యంలో 85 రోజుల నుండి లెక్కించగా రూ. 33,66,477 ఆదాయం వచ్చినట్లు ఈవో శివ రుద్రప్ప తెలిపారు. లెక్కింపులో ఛైర్మన్ చంద్రశేఖర్, ధర్మకర్తలు, ఎస్సై క్రాంతి కుమార్, సిబ్బంది అర్చకులు ఉన్నారు.