ఆసుపత్రి తనిఖీ.. యంత్రాలు స్వాధీనం
MDK: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, ఆర్ఎంపీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డిప్యూటీ డీఎంహెచ్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు తూప్రాన్ పట్టణంలోని అనుమతిలేని ఓ ఆసుపత్రిలో తనిఖీలు వేశామన్నారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్న మహిళను గుర్తించామని, ఆమె వద్ద ఉన్న యంత్రాలు పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.