నేడు మన 'నీడ' మనకు కనిపించదు

HYD : గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మన 'నీడ' మనకు కనిపించదు. హైదరాబాద్‌లో ఈ శూన్యనీడ దినం గురువారం మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకూ కొనసాగుతుందని హైదరాబాద్‌లోని బి.ఎం. బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు తెలిపారు. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం శూన్యనీడ కనిపించే అవకాశం ఉండదన్నారు.