కడప పెద్ద దర్గాకు విచ్చేసిన ప్రముఖ సినీ నటులు
కడప పెద్ద దర్గాకు సినీ కమెడియన్ అలీతో పాటు ప్రముఖ నటుడు సుమన్ ఆదివారం ప్రత్యేకంగా విచ్చేశారు. ఇందులో భాగంగా దర్గా నిర్వాహకులు ఇద్దరికీ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అందరికీ శాంతి, సౌఖ్యం కలగాలని ప్రార్థించానని అలీ, సుమన్ తెలిపారు. దర్గా చరిత్ర, సంప్రదాయాలపై ఇద్దరూ ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు.