ALERT: మూడు రోజులు వర్షాలు
KMR: జిల్లాలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అలాగే, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రజలు దీనిని గమనించి జాగ్రత్తగా ఉండాలని, రైతులు పొలాల వద్ద చెట్ట కిందకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.