యువతి పెళ్లికి నిరాకరించిందని ఆత్మహత్య

VSP: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని చెక్కుడురాయి బిల్డింగ్ సమీపంలో శుక్రవారం జరిగింది. నాగేంద్ర అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లికి ఆమె నిరాకరించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.