తుది దశకు చేరుకున్న రైతు బజార్ పనులు

ప్రకాశం: కనిగిరిలోని తీగల గొందిలో నిర్మిస్తున్న రైతు బజార్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం షాపుల నిర్మాణం పూర్తికాగా ఫ్లోరింగ్ పనుల కోసం జేసీబీతో రైతు బజార్ ప్రాంగణాన్ని చదును చేసి ఇసుకను తోలారు. దాదాపు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ. 1.10 కోట్లతో నిర్మితమవుతున్న ఈ రైతు బజార్లో అటు రైతులకు ఇటు వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.