పర్యావరణ పరిరక్షణపై కళాకారుల ఆటపాట
HNK: హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్‌లో ఇవాళ పర్యావరణ పరిరక్షణపై కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. గ్రేటర్ మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణలో కళాకారులు ఆటపాటలతో పర్యావరణాన్ని ప్రజలు కాపాడాల్సిన ఆవశ్యకతపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.