గ్రామంలోకి ప్రవేశించిన సముద్రపు నీరు
కోనసీమ: మొంథా తుఫాన్ అంతర్వేది వద్ద తీరాన్ని తాకి, నరసాపురం సమీపంలో మంగళవారం అర్థరాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లవపాలెంలోకి సముద్రపు నీరు చేరి, స్థానిక కాలనీలు నీట మునిగాయి. అధికారులు అప్పటికే పూరి గుడిసెలలో ఉన్న మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు.