అకౌంట్ నుంచి డబ్బులు మాయం

అకౌంట్ నుంచి డబ్బులు మాయం

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో రైతు గుగులోతు స్వామి ఖాతా నుంచి రూ. 57,199 ఆన్‌లైన్ లావాదేవిలా ద్వారా మాయమయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం రెండు దఫాలుగా ఈ లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.