'జిల్లాలో ఆరు శిశు మరణాలు'

'జిల్లాలో ఆరు శిశు మరణాలు'

VZM: జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఎస్. జీవనరాణి వైద్య సిబ్బందికి ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో సిబ్బందితో కమిటీ సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన 3 మాతృ మరణాలు, 6 శిశు మరణాలకు గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. మాతృ, శిశు మరణాల సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.