ఉత్సవాలలో డీజేలలో నిషేధం

ADB: గణపతి ఉత్సవాలలో డీజేలు నిషేధం అని డీఎస్పీ జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుండి తీసుకువచ్చి డీజేలు ఉపయోగిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. గణపతి మండపాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరని సూచించారు. మండపం వద్ద సౌండ్ బాక్స్ లకు, మైక్‌సెట్‌లకు డీఎస్పి అనుమతి తీసుకోవాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు.