కరాటే టోర్నీలో సత్తా చాటిన చింతపల్లి విద్యార్థులు
ASR: ఈనెల 23న కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే టోర్నీలో చింతపల్లి ఏకలవ్య పాఠశాల విద్యార్థులు మెరిశారు. అండర్-14 కేటగిరీ 50 కేజీల విభాగంలో పాడి జాస్మినీ కృష్ణప్రియ స్వర్ణం, అండర్-12 కేటగిరీ 30 కేజీల విభాగంలో ఆమె తమ్ముడు పాడి లోహిత్ కృష్ణ రజత పతకాన్ని సాధించారు. అక్కా-తమ్ముళ్లు ఒకే టోర్నమెంట్‌లో పతకాలు సాధించడం విశేషం.