రేపు మాంసం, మద్యం విక్రయిస్తే చర్యలు: ఎస్సై

అన్నమయ్య: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం చిట్వేలు మండలంలో మాంసం, మద్యం విక్రయాలు నిషేధిస్తున్నట్లు చిట్వేలు ఎస్సై నవీన్ బాబు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాంసం, మద్యం అమ్మకాలు విక్రయించరాదన్నారు. మండలంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.