రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
AKP: పరవాడ మండలం లంకెలపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్ (27) విధులకు హాజరయ్యేందుకు సైకిల్‌పై లంకెలపాలెం నుంచి అగనంపూడి వెళుతుండగా అనకాపల్లి వైపు నుంచి వస్తున్న వాహనం ఢీ కొట్టిందని తెలియాజేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.