ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్సీ
HYD: సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో హనుమాన్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీనగర్‌లో స్థానిక BJP నేతలతో కలిసి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులకు ఆయన భోజనం వడ్డించారు. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. BJP శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు.