చేపల వేటకు వెళ్లి బాలుడు మృతి

చేపల వేటకు వెళ్లి బాలుడు మృతి

SDPT: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన జగదేవపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. జగదేవపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన కాకి పడిగే అరవింద్(18) గ్రామంలోని బతుకమ్మ కుంటలో చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో పడి మృతి చెందాడు.