VIDEO: ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
కోనసీమ: రామచంద్రపురం ఫైర్ ఆఫీసర్ కె.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతాలలో ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఉన్న ఆర్టోస్ డ్రింక్ ఫ్యాక్టరీ, చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ లో సిబ్బందికి ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.