'నా కూతుళ్లు పంపిన జీతమా..?'

'నా కూతుళ్లు పంపిన జీతమా..?'

TG: చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. నిన్న ఆ ముగ్గురు కూతుళ్ల తండ్రికి స్థానిక MLA రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.7లక్షల చొప్పున మొత్తం రూ. 21 లక్షల పరిహారం అందించారు. ఈ పరిహారం తీసుకుంటూ.. 'నా రెండో కూతురు ఉద్యోగం చేసి నెలకు రూ.60వేలు పంపేది. ఇప్పుడు ముగ్గురు కుమార్తెలు కలిపి పంపించిన జీతమా' అంటూ ఆ తండ్రి రోదించాడు.