'ప్రతి ఇంటికి తిరిగి క్యాన్సర్ సర్వే నిర్వహించాలి'
E.G: గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి బదిలీపై వచ్చిన డాక్టర్ జీ.వైశాలి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి క్యాన్సర్ సర్వే నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు పరీక్షలు చేయించుకుని డాక్టర్ల సలహాలు పాటించాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.