హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం

JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కోరిన కోరికలు తీర్చే అంజన్న కొండపై కొండంత సందడి నెలకొంది. మొదటిరోజు ఆనవాయితీగా వస్తున్న పట్టువస్త్రాలను భద్రాచలం EO రమాదేవి, ప్రత్యేక అధికారి వినోద్ రెడ్డి, కొండగట్టు ఆలయ EO చంద్రశేఖర్ సమర్పించారు.