VIDEO: భక్తులతో కిటకిటలాడిన శ్రీ నూకాంబిక దేవాలయం
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్లో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం భక్తులు రద్దీతో కిటకిటలాడింది. నూతన ఆలయం కొత్త అమావాస్య ముందు వచ్చే ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.