జూద స్థావరంపై పోలీసులు దాడి.. ఇద్దరు మహిళలు అరెస్ట్
BPT: ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు జూద స్థావరాలపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. వెదుళ్లపల్లి ఎస్సైకి అందిన సమాచారం ఆధారంగా స్టేషన్ పరిధిలోని స్టువర్ట్‌పురం శివారులో జూదం ఆడుతున్న స్థావరంపై దాడి చేసి ఇద్దరు మహిళలతోపాటు ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రూ. 2,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.