'అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలి'

SRPT: విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేటలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల వర్ధంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.