తెలంగాణ మోడల్ రోడ్లు దేశంలోనే ఎక్కడా ఉండవు: మంత్రి
HYD: 2028 జూన్ నాటికి ఎవరు ఊహించని రీతిలో రాష్ట్రంలో రోడ్డు నిర్మాణాలు జరగనున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్ రోడ్లు దేశంలోనే ఎక్కడ ఉండవని, రోడ్లు అంటే తెలంగాణ అని చెప్పే విధంగా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆలస్యమైనా కూడా రోడ్డు నిర్మాణాలను ఊహించని రీతిలో చేపడతామన్నారు.