విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులకు విన్నపం
W.G: యర్రంశెట్టివారిపాలెంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇవాళ గ్రామ సచివాలయంలో విద్యుత్ శాఖ ఈఈ మధుకుమార్, ఏడీఈ రాజీవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ యర్రంశెట్టి బాబులు గ్రామ పరిధిలోని విద్యుత్ ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.