'చెరువుకు వరద చేరేలా చర్యలు తీసుకోవాలి'
HYD: మాదాపూర్‌లోని సున్నం చెరువుతోపాటు తమ్మిడి కుంట పరిసరాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. సున్నం చెరువు చెంతన ఉన్న బోరబండ బస్తీ, ఎన్ఆర్ఆర్ పురం నుంచి వచ్చే వరద నీరు నేరుగా చెరువులోకి కలిసేలా తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. వర్షాలు పడినప్పుడు వరద నీరు నేరుగా చెరువులోకి చేరేలా చేయాల్సిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.