అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి

మేడ్చల్: తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ & డైరెక్టర్ TK శ్రీదేవిని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బుధవారం కలిసి పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. దుండిగల్, నాగులూరు, డి.పోచంపల్లి తండాలో అభివృద్ధి, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాలని కోరారు. సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందించారు.