ప్రజలకు మరింత చేరువగా 108 సేవలు: రోహిత్

ప్రజలకు మరింత చేరువగా 108 సేవలు: రోహిత్

KMR: పిట్లం ఆస్పత్రికి చెందిన 108 అంబులెన్స్ వాహనాన్ని బుధవారం పిట్లం మెడికల్ ఆఫీసర్ రోహిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వి ఆదేశాల మేరకు ఆయన ఈ తనిఖీలు నిర్వహించారు. వాహనంలో అందుబాటులో ఉన్న మందులు, వాటి నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు 108 అంబులెన్స్ సేవలు ఎంతో భరోసా ఇస్తాయని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదన్నారు.