శ్రీకాకుళం నృత్య బృందానికి కేంద్ర మంత్రి అభినందనలు
SKLM: ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీకాకుళం కీర్తిని జాతీయ స్థాయిలో చాటిన రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును కలిశారు. అత్యుత్తమ నృత్య ప్రదర్శనకు ఆయన అభినందనలు తెలుపుతూ, వారి భవిష్యత్ కార్యాచరణపై వివరాలు తెలుసుకుని పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.