జిల్లాకు ఆరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

జిల్లాకు ఆరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

NLG: జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు ఆరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ బీ. చంద్రశేఖర్ తెలిపారు. అందులో నల్గొండ (దోమలపల్లి), నాగార్జునసాగర్ (పెద్దవూర), నకిరేకల్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాలకి ఒక్కో పాఠశాలని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, క్రీడ మైదానాలు, ప్రయోగశాలలు అభివృద్ధి చేయనున్నారు.