రేపు గుడిపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

NLG: గుడిపల్లి మండలంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ బుధవారం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. భీమనపల్లిలో 'జనహిత - ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్' కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీల్లో పర్యటిస్తారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.