బాధితునికి LOC అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు
WGL: గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ సాయి గణేష్ కాలనీకి చెందిన కడమంచి దీక్షితకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన ఐదు లక్షల రూపాయల ఎల్ఓసిని నేడు వారి కుటుంబ సభ్యులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నామని, సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.