జంగారెడ్డిగూడెంలో ఘనంగా శోభాయాత్ర

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువైయున్న శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి 61వ వార్షిక ఉగాది జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పట్టణంలో కొలువైన శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారు సాంప్రదాయ సారెతో కదిలి వెళ్లే సందర్భంగా మంగళవారం శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.