VIDEO: ప్రకాశం కాలనీలో ప్రత్యక్షమైన జింక

CTR: పుంగనూరు పట్టణం ప్రకాశం కాలనీలో శుక్రవారం ఓ జింక ప్రత్యక్షమయ్యింది. జింకను కుక్కలు తరమడంతో కాలనీకి చెందిన రెడ్డమ్మ ఇంటిలోకి పరుగులు తీసింది. గమనించిన సుబ్రహ్మణ్యం, కుమార్‌లు గాయాపడిన జింకను కాపాడి పసుపు రాసి చికిత్సలు చేశారు. అటవీ ప్రాంతం నుంచి జింక తప్పిపోయి వచ్చినట్లు భావించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.