గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
GNTR: అరండల్ పేట పోలీసులు ఇద్దరు గంజాయి విక్రేతలను నిన్న అరెస్ట్ చేశారు. శారదాకాలనీ వాసి వెంకటేష్, ఏటి అగ్రహారం వాసి చంద్రరాజేష్ గంజాయికి అలవాటు పడ్డారు. జల్సాల కోసం గంజాయిని చిన్న పొట్లాలుగా కట్టి విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. బ్రాడీపేటలో గంజాయి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.