నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా: రేగా
TG: మణుగూరు బీఆర్ఎస్ ఆఫీస్ తమదేనని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆఫీసుకు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర ఆధారాలు ఉంటే చూపాలని.. వాళ్లు చెప్పింది నిజమైతే ముక్కు నేలకు రాస్తానన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం కాదని.. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోండని సవాల్ చేశారు.