గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
RR: యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కగుట్ట తండా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని 65 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎరుపు రంగు టీ షర్టు, నీలం రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని అన్నారు. సమాచారం తెలిస్తే పోలీసులకు తెలుపాలన్నారు.