దొంగచాటుగా ఫోటోలు.. దేహశుద్ధి చేసిన మహిళలు
GNTR: దుగ్గిరాలలోని ఓ ఆకతాయికి స్థానికులు బుద్ధిచెప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆంజనేయులు అనే వ్యక్తి బస్టాండ్‌కు వచ్చే మహిళలు, యువతులను దొంగచాటుగా ఫోటోలు తీస్తున్నాడు. 3 రోజుల క్రితం అతడు ఫోటోలు తీస్తున్నాడని అనుమానం వచ్చి ఓ యువతి ఫోన్ లాక్కుని చూడగా, తన ఫోటోలతో పాటు ఎంతో మంది మహిళల ఫోటోలు చూసి షాకైంది. దీంతో అతడిపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాడి చేశారు.