కొత్తవలసకు ఏ.ఈ అప్పారావు బదిలీ

VZM: కొత్తవలస మండల విద్యుత్ శాఖ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇమంది అప్పారావు దాసన్నపేటలో ఉన్న ప్రధాన కార్యాలయంలో విద్యుత్ పంపిణీ విభాగానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వేపాడ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న చొప్ప సూరిబాబు కొత్తవలసకు బదిలీ వచ్చారు. కొత్తగా వచ్చిన ఏ.ఈకి సిబ్బంది స్వాగతం పలుకుతూ పూల మొక్కను అందజేశారు.