'లోక్ అదాలత్ పై దృష్టి సారించాలి'

'లోక్ అదాలత్ పై దృష్టి సారించాలి'

W.G: డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ప ప్రత్యేక దృష్టి సారించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి అన్నారు. ఈ మేరకు శనివారం నరసాపురం కోర్టు హాలులో పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయవాదులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమ న్యాయం అందించడానికి పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.