ప్రకృతి వ్యవసాయ రైతులకు లింగాకర్షక బుట్టలు పంపిణీ

SKLM: ప్రకృతి వ్యవసాయంలో అత్యంత కీలకమైన పసుపు పళ్లాలు, లింగాకర్షక బుట్టలను రైతులకు అందజేశామని ప్రకృతి వ్యవసాయ మాస్టర్ తోట రమణ తెలిపారు. నరసన్నపేట మండలం దేవాదిలో శుక్రవారం రైతులకు అందజేశామన్నారు. ఎకరా భూమిలో 15 పసుపు పళ్లాలు, ఆరు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలన్నారు. దీనివలన పచ్చ దోమ, తెల్ల దోమ తో పాటు కాండం తొలిచే పురుగులను నివారిస్తుందన్నారు.