మహిళ అదృశ్యం.. కేసు నమోదు

మహిళ అదృశ్యం.. కేసు నమోదు

MBNR: నవాబుపేట మండలం హన్వాస్‌పల్లి గ్రామంలోని ఓ మహిళ అదృశ్యమైనట్లు ఎస్సై విక్రం తెలిపారు. పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెల 19న కూలికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.