నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

W.G: తాడేపల్లిగూడెంలో ఇవాళ ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నరసింహమూర్తి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11కేవీ కొబ్బరి తోట, పడాల ఫీడర్లపై విద్యుత్తు లైన్ మరమ్మతుల వల్ల సరఫరా ఉండదన్నారు. పడాల, పడాల గరువు, భాగ్యలక్ష్మి పేట, యాగర్లపల్లి, ముత్యాలంబాపురం ప్రాంతాల వినియోగదారులు సహకరించాలన్నారు.