ఉరుమడ్ల వసతి గృహం ఆకస్మిక తనిఖీ
NLG: ప్రభుత్వం అందించే సౌకర్యాలను వసతిగృహం విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని ఎంపీడీవో జయలక్ష్మి, ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ విజయ సూచించారు. చిట్యాల మండలం, ఉరుమడ్ల బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యా ఆరోగ్య విషయాలను వార్డెన్ ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు.